రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2022-08-09T05:50:40+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

రాష్ట్రంలో అరాచక పాలన

అన్ని రంగాలనూ దోచుకుతింటున్న జగన్‌రెడ్డి 

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మైలవరం రూరల్‌, ఆగస్టు 8 : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. చండ్రగూడెంలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక దోపిడీ, నాసిరకం మద్యం, అన్ని రంగాల్లో వైసీపీ సర్కాల్‌ దోపిడీకి పాల్పడుతోందన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్పా, వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువులపై పన్నుల బాదుడుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అతలాకుతలం అవుతున్నా రన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నివర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందు లు వర్ణణాతీతం అన్నారు. జగన్‌రెడ్డి సర్కార్‌ చేసే అరాచకాలు, దుర్మార్గాలు ప్రజలకు తెలిపేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.  ఈ కార్యక్ర మంలో మండల పార్టీ అధ్యక్షుడు తాతా పోతురాజు, చల్లా సుబ్బారావు, వజ్రాల కుమారరెడ్డి, సుధాకర్‌, బూదేటి రామారావు, రోశాలు, లంకా లితీష్‌, నంబూరి శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:50:40+05:30 IST