రైతంటే ఇంత నిర్లక్ష్యమా!

ABN , First Publish Date - 2022-12-12T01:19:18+05:30 IST

తుఫాను కారణంగా తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

రైతంటే ఇంత నిర్లక్ష్యమా!

మైలవరం, డిసెంబరు 11 : తుఫాను కారణంగా తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశుల్ని ఆదివారం పరిశీలించారు. మార్కెట్‌ యార్డుకు వచ్చి పది రోజులు కావస్తున్నా ఇంత వరకు ధాన్యం కొనుగోలు చేయకపోగా, కనీసం పట్టాలు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిపోతుంటే ఎమ్మెల్యే, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలకు, యార్డులకు పార్టీ రంగులు, పార్టీల ఫ్లెక్సీలు పెట్టి ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప రైతు ల గోడు పట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి రైతులను మో సం చేస్తున్నారన్నారు. మార్కెట్‌ యార్డుకు రంగులు వేసుకునేందుకు ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదా అని ప్రశ్నించారు. ఎక్కడ ధాన్యం అక్కడ కల్లాల్లోనే ఉందన్నారు. ఆర్‌బీకేల్లో సంచులు లేవని పది రోజుల క్రితం నూర్చిన పంట కొనుగోలు చేసే వారే లేరని అన్నారు. పట్టిసీమ నీళ్లు వస్తే పది బస్తాలు ఎక్కువ పండాయని, తాను వెళ్లి చూస్తే పట్టిసీమ పంపులు, మోటర్లు బూజు పట్టి ఉన్నా యన్నారు. మార్కెట్‌ యార్డులో రైతులను ఎమ్మెల్యే, యార్డు చైర్మన్‌ కానీ పట్టించుకోవడం లేదని, ధాన్యం తడిసి మొలకెత్తిందని ఒక రైతు ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశాడన్నారు. అం దుకు తానే స్వయంగా బాధ్యత తీసుకుని పట్టాలు టీడీపీ ఆధ్వర్యంలో అందజేశామన్నారు. మిగిలిన రైతులకు దాతలు ముందుకు వచ్చి రైతులకు పట్టాలు అందజేసి అండగా ఉండాలని సూచించారు. రైతు కన్నీరు మంచిది కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పం దించి తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తడిచిన ధాన్యపు ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిపై రైతులతో కలసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు ఉమాను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతలు తాతా పోతురాజు, మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ, లంక లితీష్‌, మద్దినేని శ్రీనివాసరావు, ఉయ్యూరు నర్శింహారావు, లంక రామకృష్ణ, మైక్‌ బాబురావు, వెంకట్రావు, జి.కొండూరు నేతలు పాల్గొన్నారు.

రైతుల పక్షాన పోరాటం

మైలవరం : ఎన్ని కేసులు పెట్టినా రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పోలీ్‌సస్టేషన్‌ నుం చి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పుతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ బతుకు బట్టబలైందన్నారు. ప్రభు త్వ ఆస్తులు ఎలా దోచుకున్నారో, విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఎలా కట్టారో తేటతెల్లమైందన్నారు. మీ అయ్యా, నువ్వు జాతీయ నాయకులా.. మీ బ తుకులు చెడా అని ఎమ్మెల్యే వసంతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ రామాటాకీస్‌ వద్ద ఉండే వారికైనా నీతి ఉంది కాని నీకూ.. మీ అయ్యకు నీతి ఉందా.. ఐదేళ్లు టీడీపీతో అం టకాగి పార్టీ మారిన మీరు రాజకీయ వ్యభిచారులు, ఊసరవెల్లులు అని దుయ్యబట్టారు. వసంత.. నీకు దమ్ము, దైర్యం ఉంటే వసంత ప్రాజెక్టుల్లో డైరెక్టర్ల పేర్లు చెప్పగలవా అని సవాల్‌ విసిరారు. వె.ౖవి.సుబ్బారెడ్డికి నువ్వో బినామీ, బ్రోకర్‌ అని దుయ్యబట్టారు.

Updated Date - 2022-12-12T01:19:18+05:30 IST

Read more