ఈ బంధం అపు‘రూప’ం
ABN , First Publish Date - 2022-12-19T00:50:14+05:30 IST
కవల పిల్లల జన్మ ఓ ప్రత్యేకం. ఒకే రూపంలో జన్మించిన కవలలు ముద్దులొలికే మోముతో అబ్బురపరిచే చేష్టలతో, ఆకట్టుకొనే ఆటపాటలతో అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు.
విజయవాడ కల్చరల్, డిసెంబరు 18 : కవల పిల్లల జన్మ ఓ ప్రత్యేకం. ఒకే రూపంలో జన్మించిన కవలలు ముద్దులొలికే మోముతో అబ్బురపరిచే చేష్టలతో, ఆకట్టుకొనే ఆటపాటలతో అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు. కవలలను ఒక జంటను చూస్తేనే ము చ్చట వేస్తుంది. అలాంటిది 36 జంటలు ఒకే చోట చేరితే.. అది పండుగ వాతావరణాన్నే తలపిస్తుంది. నగరంలో ఆదివారం సాయంత్రం అదే జరిగింది. శ్రీ దేవి సాంస్కృతిక సంక్షేమ, సంఘం, విజయవాడ క ల్చరల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని విజయవాడ కల్చరల్ సెంటర్‌లో ‘అభినవ లవ కుశలు’ పేరిట కవలల జంటల ప్రదర్శన ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కవలలంతా ఒకే చోట చేరి.. ఆడి, పాడి సందడి చేశారు. ఒకే కుటుంబ స భ్యుల్లా తల్లిదండ్రులతో పాటు అందరూ ఆనందంగా గడిపారు. ఒకచోట కలిసి, వారిలోని కళలను ప్రదర్శించారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెలు ఇలా అంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడికి వచ్చినవారు ఒకే పోలికలతో ఉన్న ఆయా జోడీలను చూసి మైమరిచిపోయారు. అంతా ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.