ట్రాఫిక్ కష్టాలు!
ABN , First Publish Date - 2022-05-19T06:23:23+05:30 IST
ట్రాఫిక్ కష్టాలు!
ఫ వన్‌వేగా శివాలయం రోడ్డు
ఫ పాత స్టేట్‌బ్యాంకు రోడ్డులో ట్రాఫిక్
ఫ ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డగోలుగా పార్కింగ్
ఫ పట్టించుకోని నగర పంచాయతీ అధికారులు
ఫ ఇబ్బందులు పడుతున్న పాదచారులు
ఉయ్యూరు, మే 18 : స్థానిక పాత స్టేట్‌బ్యాంకు రోడ్డులో అనునిత్యం ట్రాఫిక్ స్తంభించటంతో వాహనాలపై వెళ్లేవారితో పాటు పాదాచారులకు సైతం అసౌకర్యం కలుగుతుంది. శివా లయం రోడ్డును వన్‌వే ట్రాఫిక్ చేసిన పోలీసులు పాత స్టేట్‌బ్యాంకు రోడ్డును పట్టించుకోపోవడంతో ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్ సమ స్య తలెత్తుతుంది. వన్‌వే చేసిన కారణంగా ప్రధాన సెంటర్ నుంచి శివాలయం వైపు వెళ్లేందుకు వీలు లేకుండా బారికేడ్లు అడ్డుపెట్టి వన్‌వే చేయ డంతో తోట్లవల్లూరు రోడ్డు, శివాలయం రోడ్డులోకి వెళ్లే వాహ నాలన్నీ పాతస్టేట్ బ్యాంకు రోడ్డులోకి వస్తున్నాయి. ఫ్లోరా వంతెన వద్ద నుంచి ప్రధాన సెంటర్ వైపు వచ్చే పెద్ద వాహనాలు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఈ రోడ్డుమీదుగా మెయిన్ రోడ్డుకు వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగి సమస్య ఏర్పడుతుంది. రోడ్డు ప్రారంభంలో టిఫిన్ సెంటర్ వద్ద, గౌడ రామాలయం, పోస్టాఫీసు రోడ్డు వద్ద నిలుపుతున్న ఆటోలు, ద్విచక్రవాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య నానాటికి మరింత తీవ్రమవుతుంది.