లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించాలి

ABN , First Publish Date - 2022-12-07T00:58:47+05:30 IST

లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను కేటాయించాలని, జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించాలి
మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీపీఐ ధర్నా

తిరువూరు, డిసెంబరు 6: లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను కేటాయించాలని, జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యవర్గం సభ్యుడు తూము కృష్ణయ్య, పట్టణ కార్యదర్శి కొత్తపల్లి సుందరావులు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హ యంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు తమ వాటా నగదు చెల్లించారు. బ్యాంకులు రుణం చెల్లించాలని లబ్ధిదారులకు నోటీలు జారీ చేస్తున్నాయన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ కార్యాలయం మేనేజర్‌ త్రినాథ్‌కు అందజేశారు. నాయకులు సుభాని, ముత్తయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, మస్తాన్‌, అశోక్‌, గువ్వల వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యం, సుఽనీల్‌, నరసింహారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:58:49+05:30 IST