-
-
Home » Andhra Pradesh » Krishna » They are getting satanic pleasure by changing their name-NGTS-AndhraPradesh
-
పేరు మార్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు
ABN , First Publish Date - 2022-09-29T06:42:07+05:30 IST
పేరు మార్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి: బొండా ఉమా
గవర్నర్‌పేట, సెప్టెంబరు 28: ‘‘ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చ డమంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మంట కలపడమే.. జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న యూనివర్సిటీ పేరు మార్చాలని వైఎసార్ సహా ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయలేదు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు’’. అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొన సాగించాలని టీడీపీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 24వ డివిజన్ సీతారామపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పేరు తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఉమా హెచ్చ రించారు. నవనీతం సాంబశివరావు, నెల్లిబండ్ల బాలస్వామి, ఇజ్జాడ దుర్గారావు, బత్తుల అప్పారావు, వేమూరి జనార్దన్, జి.మురళి, టి.ఉదయభాస్కర్, పరుచూరి రవి, బత్తుల ఉష, రమణ, కర్రీ గోవిందు, సుజాత, రాంబాబు, ఇజ్జాడ పవన్ కుమార్, ప్రసాద్‌రాజు, తిరుపతిరావు పాల్గొన్నారు.