అండర్-11 చెస్ జిల్లా విజేతలు వీరే
ABN , First Publish Date - 2022-08-08T06:14:05+05:30 IST
అండర్-11 చెస్ జిల్లా విజేతలు వీరే

విజయవాడ స్సోర్ట్సు, ఆగస్టు 7: చెస్ ఉమ్మడి కృష్ణాజిల్లా అసోసి యేషన్ ఆధ్వర్యంలో రమ్య ఫిటెనెస్ స్టూడియోలో అండర్-11 జిల్లాస్థాయి చెస్ పోటీలు ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. బాలికల విభాగంలో మందుల మేరీ ఆమెన్ నాలుగు పాయింట్లతో ప్రథమ, జలవాడి నందిక 3 పాయింట్లతో ద్వితీయ స్థానాలు, బాలుర విభాగంలో కొల్లా భువన్ 5 పాయింట్లతో ప్రథమ, అనగాని శశాంక్ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ నలుగురు విశాఖపట్నం జిల్లాలో ఈనెల 20, 21 తేదీల్లో రా ష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారు. విజేతల బహు మతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథులుగా మిసెస్ అమరావతి, పరిపూర్ణ మహిళ అవార్డు గ్రహీత జకీర బేగమ్, కొత్తపల్లి లలిత, ఫిటెనెస్ స్టూడియో డైరెక్టర్ రమ్య, జిల్లా చెస్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అక్బర్ పాషా, ఎం. రాజీవ్ పాల్గొన్నారు.