రంగస్థలమే నా ప్రాణం: కోట శంకరరావు
ABN , First Publish Date - 2022-11-28T01:14:59+05:30 IST
సినిమా రంగం కంటే రంగస్థలమంటేనే తనకు ప్రాణ మని నటుడు కోట శంకరరావు అన్నారు. ఎక్స్‌రే సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వ ర్యంలో ఠాగూర్ గ్రంథాలయంలో ఆది వారం రాత్రి ఆయనకు అభినందన సభ నిర్వహించారు
విజయవాడ కల్చరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సినిమా రంగం కంటే రంగస్థలమంటేనే తనకు ప్రాణ మని నటుడు కోట శంకరరావు అన్నారు. ఎక్స్‌రే సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వ ర్యంలో ఠాగూర్ గ్రంథాలయంలో ఆది వారం రాత్రి ఆయనకు అభినందన సభ నిర్వహించారు. తాను జన్మించిన గడ్డపై సత్కారం అందుకోవడం ఆనందంగా ఉం దన్నారు. సినిమారంగం, బుల్లితెర తనను బాగానే ఆదరిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎక్స్‌రే సంస్థ నిర్వాహకుడు కొల్లూరి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శన అలరించింది. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మా సాహిత్య సాంస్కృతిక అకాడమీ కోట శంకరరావుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది.