మూడో విడత వైఎస్సార్‌ చేయూత చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-25T05:48:18+05:30 IST

హెచ్‌బీ కాలనీ వీఎంసీ కల్యాణ మండంపంలో 3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకం కింద శనివారం 43, 44, 45, 49 డివిజన్లకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రూ.4.12 కోట్ల విలువైన చెక్కును అందజేశారు.

మూడో విడత వైఎస్సార్‌ చేయూత చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి

మూడో విడత వైఎస్సార్‌ చేయూత చెక్కుల పంపిణీ

భవానీపురం, సెప్టెంబరు 24 :  హెచ్‌బీ కాలనీ వీఎంసీ కల్యాణ మండంపంలో 3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకం కింద శనివారం 43, 44, 45, 49 డివిజన్లకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రూ.4.12 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, మైలవరపు రత్నకుమారి, లావణ్య, బుల్లా విజయ్‌కుమార్‌, నాయకులు కంది శ్రీనివాసరెడ్డి,ఎం.కృష్ణ, మాదాల తిరుపతిరావు,ఎం. పోలిరెడ్డి, జోనల్‌ కమిషన ర్‌ సుధాకర్‌లు పాల్గొన్నారు. 

లబ్బీపేట: రాణిగారితోట 18వ డివిజన్‌ సిమెంట్‌ గోడౌన్‌లో 17,18 డివిజన్లకు సంబంధించి 900 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,62,500 వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది. చెక్కును లబ్ధిదారులకు దేవినేని అవినాష్‌ అందజేశారు. డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు వెంకట సత్యనారాయణ, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more