-
-
Home » Andhra Pradesh » Krishna » The problems of municipal teachers should be solved-NGTS-AndhraPradesh
-
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-11T06:17:15+05:30 IST
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

గవర్నర్‌పేట, అక్టోబరు 10: జీవో నెం బరు 84 విడుదల కాకముందు, తరువాత అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరించాలని యూటీ ఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఎంజీ రోడ్డులోని యూటీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో యూటీఎఫ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ హెచ్‌ఎంలకు డీడీవో అధికారాలు ఇవ్వాలని, జిల్లా పరిషత్ యాజమాన్యంతో పాటుగా మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని, జీవో 84 ద్వారా ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 20న అన్ని డీఈవో కార్యాలయాల ఎదుట ధర్నా చేపడతామని నేతలు హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణసుందరరావు, రాష్ట్ర నాయకులు ఎస్‌పీ మనోహర్‌కుమార్, ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య, సిటీ యూనిట్ అధ్యక్షురాలు జి. విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.