-
-
Home » Andhra Pradesh » Krishna » The MLA who held the Ardeo office hostage-NGTS-AndhraPradesh
-
ఆర్డీవో కార్యాలయాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-02-23T06:11:18+05:30 IST
మైలవరం ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే వసంత ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో నోరు తెరచి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

తెల్లదేవరపాడు గౌరవ సభలో వసంత, అనుచరులపై మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజం
జి.కొండూరు, ఫిబ్రవరి 22: మైలవరం ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే వసంత ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో నోరు తెరచి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తెల్లదేవరపాడులో మంగళవారం నిర్వహించిన గౌరవసభలో మాట్లాడుతూ మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఽఅఖిలపక్షం ఆధ్వర్యంలో వారం రోజుల్లో నిరసన దీక్షలు, కార్యాచరణ ప్రణాళికలు నిర్ణయించన్నుట్లు చెప్పారు. ఎమ్మెల్యేకు బార్ అండ్ రెస్టారెంట్‌ల మీద ఉన్న శ్రద్ధ మైలవరం రెవెన్యూ డివిజన్ సాధనపై లేదన్నారు. దద్దమ్మ మైలవరంలో ఆర్డీవో ఆఫీసు పెట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టి మండలానికి ఒక బార్ అండ్ రెస్టారెంట్, మద్యం షాపులు, మాల్స్ ద్వారా ఎమ్మెల్యే బామ్మర్ది, నవ గ్రహాలు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపిం చారు. బ్రాంది షాపులకు కృష్ణా పైపులైన్ కనెక్షన్స్ ముఖ్యమా? పేదవాని ముఖ్మమా అని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తి పడి రైల్వే ట్రాక్‌ల వద్ద, బుడమేరులో పేదలకు ఇళ్ల పట్టాలిస్తారా అని ప్రశ్నించారు. ఇంటింటికి కుళాయి పనులకు రూ.186 కోట్లు తెస్తే వాటిని పాడు పెట్టారన్నారు. 33 నెలల్లో ఎమ్మెల్యే వసంత ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జువ్వా రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, పటాపంచల నరసింహారావు, లంక లితీష్, మన్నం వెంకట చౌదరి, సుకవాసి శ్రీహరి, బూర్సు శివ, పొన్నగంటి నాగమల్లేశ్వరరావు, ఉండిమోదుగుల ప్రసాద్, బద్దిర వెంకటేశ్వరరావు, బట్టు రాయప్ప, గరికపాటి శివ, షేక్ రంగావలి పాల్గొన్నారు.
ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాగివేత : ముద్దరబోయిన
చాట్రాయి : ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో ఇచ్చి.. వివిధ రకాల పన్నులు భారీగా పెంచి మరో చేత్తో లాకంటున్నదని నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. పోతనపల్లి, బూరగ్గూడెం గ్రామాల్లో గౌరవ సభల్లో మాట్లాడారు. తొలుత గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏగ్రామానికి వెళ్లినా మురుగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకా ప్రతాప్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో మందపాటి బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి.చిట్టిబాబు, నోబుల్‌రెడ్డి, నక్కా రాము, గోవర్దనరెడ్డి పాల్గొన్నారు.