-
-
Home » Andhra Pradesh » Krishna » The excellence of Khadi should be shown to the country-NGTS-AndhraPradesh
-
ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పాలి
ABN , First Publish Date - 2022-09-30T05:53:36+05:30 IST
ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందరికి పరిచయం అయ్యేలా విద్యార్థులు కృషి చేయాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.వి. రావు అన్నారు.

ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పాలి
కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ రావు
సత్యనారాయనపురం, సెప్టెంబరు 29: ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందరికి పరిచయం అయ్యేలా విద్యార్థులు కృషి చేయాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.వి. రావు అన్నారు. భానునగర్ కేంద్రీయ విద్యాలయంలో జాతీయ ఖాదీ ఉద్యమం పురస్కరించుకుని కేంద్ర ఖాదీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఖాదీ వస్త్రాల వినియోగం వల్ల ప్రయోజనాలు ప్రజలందరికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఖాదీ సంస్థ ఎగ్జిక్యూటీవ్ మేనేజర్ బీ సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రామ్మూర్తి ఖాదీ ప్రయోజనాలను వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అందచేశారు. కేంద్రీయ విద్యాలయం కల్చరల్ కో-ఆర్డినేటర్ కె. నాగమోహనరావు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.