మహిళలు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది
ABN , First Publish Date - 2022-02-08T05:23:15+05:30 IST
మహిళలు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది
తెలుగు మహిళల ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 7 : మహిళా శక్తి ఎంతో గొప్పదని, మహిళలు తలచుకుంటే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు మహిళల నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 150 మంది మహిళలు అకృత్యాలకు గురయ్యారన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రానున్న రెండున్నరేళ్లలో మహిళలు ప్రజలను చైతన్యపరచాలన్నారు. తలశిల స్వర్ణలత మాట్లాడుతూ జిల్లా తెలుగు మహిళల తెగువను ఎంతో ధైర్యంగా ప్రదర్శిస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యమని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ తెలుగు రైతు అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ, టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి లతీఫున్నీసా, టౌన్ అధ్యక్షురాలు వసంత, ప్రధాన కార్యదర్శి త్రిపుర, కరెడ్ల సుశీల, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, దింటకుర్తి సుధాకర్, సమతాకీర్తి, దేవరపల్లి అనిత, అన్నం శ్రీఆనంద్ మాట్లాడారు. తెలుగు మహిళ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, ఉపాధ్యక్షురాలు ఎం.లక్ష్మీనాంచారమ్మ, మారగాని వాణి, వేమూరి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా జొన్నలగడ్డ విజయలక్ష్మి, అధికార ప్రతినిధిగా బి.నాగవెంకట లక్ష్మి, మరకాని సమతాకీర్తి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు.