టీడీపీతోనే దళితుల సంక్షేమం

ABN , First Publish Date - 2022-12-07T00:54:09+05:30 IST

టీడీపీ ప్రభుత్వంలోనే దళితుల సంక్షేమం సాధ్యమని, అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం ద్వారా అనేకమంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిందని, నేడు ఎంతోమంది దళిత యువత విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్ధాయిలో స్ధిరపడ్డారంటే అది నారా చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.

 టీడీపీతోనే దళితుల సంక్షేమం
ఈడుపుగల్లులో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, దేవినేని రాజా

ఉంగుటూరు, డిసెంబరు 6 : టీడీపీ ప్రభుత్వంలోనే దళితుల సంక్షేమం సాధ్యమని, అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం ద్వారా అనేకమంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిందని, నేడు ఎంతోమంది దళిత యువత విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్ధాయిలో స్ధిరపడ్డారంటే అది నారా చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మండలంలోని పొట్టిపాడు, ఆత్కూరు గ్రామాల్లో మంగళవారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాటిపాముల నాగయ్య, కర్నాటి మణికంఠసాయి, చిరుమామిళ్ల సూర్యం, వేమారెడ్డి శ్రీనివాసరావు, గుండపనేని సురేంద్ర, కొలుసు శ్రీనివాసరావు, మారం అయోధ్యరామయ్య, వీసం ఏడుకొండలు, షేక్‌ మీరావలి, గర్శేపల్లి చంద్రయ్య, అట్లూరి రామ్‌కిరణ్‌, తాతినేని సుజన్‌బాబు, తమ్మారెడ్డి సాంబశివరావు, దేవినేని విజయ్‌, సురేష్‌ పాల్గొన్నారు.

ఈడుపుగల్లులో ..

ఈడుపుగల్లు (కంకిపాడు) : రాష్ట్రాన్ని మద్యాం ధ్రప్రదేశ్‌గా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మార్చేశాడని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మండలం లోని ఈడుపుగల్లులో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడు తూ దేశంలోనే మత్తు పదార్థాల తయారీలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ ను మత్తాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆరోపించారు. అమరాన్‌, జాకీ, కియా మోటార్స్‌ వంటి అనేక సంస్థ లు రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోతున్నా యని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 1300కు దొరికిన ట్రాక్టర్‌ ఇసుక ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు కూడా కష్టంగా లభిస్తోంద న్నారు. ప్రజలకు గోరంత పెడుతూ కొండంత దోచేసు కుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, సర్పంచ్‌ పందిపాటి ఇందిర, ఉప సర్పంచ్‌ కిలారు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ షేక్‌ మాబు సుభాని, పార్టీ నాయకులు షేక్‌ షకార్‌, పుట్టగుంట రవి, పందిపాటి సుధాకర్‌, బాబూజి, గరికిపాటి రవికిషోర్‌, కాకుళ్ల సుధాకర్‌, హరీష్‌, రాయుడు, భవాని, నాగూర్‌బీ, బండారు నిరంజనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:54:11+05:30 IST