మంత్రి జోగి రమే్‌షను బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T06:11:32+05:30 IST

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని దూషించిన మంత్రి జోగి రమే్‌షను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

మంత్రి జోగి రమే్‌షను బర్తరఫ్‌ చేయాలి
జోగి రమేష్‌ ఫొటోలను తగలబె డుతున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల డిమాండ్‌

విద్యాధరపురం, సెప్టెంబరు 26 : ఎన్టీఆర్‌ కుటుంబాన్ని దూషించిన మంత్రి జోగి రమే్‌షను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద జోగి రమేష్‌ ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి సింహాద్రి కనకాచారి బీసీ నేత వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ జోగి రమేష్‌ పరమశుంఠ అని వ్యాఖ్యానించారు. అతనికి ఎన్టీఆర్‌ కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా కుటుంబ సభ్యులు ఎవరూ పేషీకి రాలేదన్నారు. వైఎస్‌ సీఎంగా ఉండగా తండ్రి అఽధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడి 16 నెలలు జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి వద్ద మంత్రిగా ఉంటే ఇలాంటి మాటలు కాక మంచి మాటలు ఎలా వస్తాయన్నారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తుంటే, జగన్‌ సమర్థించుకోవడం హేయమన్నారు. బీసీ సెల్‌ అఽధ్యక్షుడు కాకు మల్లిఖార్జున యాదవ్‌ మాట్లాడుతూ జోగి రమేష్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లుక్కాసాయిరాం గౌడ్‌, వల్లూరి మధుసూదనరావు, పామర్తి కిశోర్‌బాబు, శొంఠి శివరామ్‌ ప్రసాద్‌, బొల్లా వెంకటేశ్వరరావు, చాగంటిపాటి కృష్ణారావు పాల్గొన్నారు.

విశాఖలో వైసీపీ పెయిడ్‌ ఆర్టి్‌స్టల సమావేశం

విశాఖపట్నంలో వైసీపీ పెయిడ్‌ అర్టి్‌స్టల సమావేశం జరిగిందని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న) విమర్శించారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. న్యా యస్థానాలు ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసినా సిగ్గురావడం లేదన్నారు. దమ్ముంటే పాదయాత్రకు కంచెవేసి చూడాలని బొత్సకు సవాల్‌ విసిరారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వికేంద్రీకరణ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడానికి సిగ్గుండాలన్నారు. ఒక రాజధానికే కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకోవడం చేతగాని జగన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.విశాఖలో భూములను వైసీపీ గద్దలు ఎక్కడికక్కడ కబ్జా చేశారని విమర్శించారు. అమరావతి మీద ఎంత విషం కక్కితే ఉద్యమం అంతగా తీవ్రతరమవుతుందని హెచ్చరించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల పేరుతో కుట్ర

అజిత్‌సింగ్‌నగర్‌ : జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల పేరుతో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమం త్రి చంద్రబాబుపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి తమకు ఏ సంబంధం లేదని కృష్ణాజిల్లా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం సభ్యులు నున్న గణేష్‌, కావూరి కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. పోస్టర్లు, లెటర్లు మీడియా చేస్తున్న ప్రచారం కుట్రని వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌ అభిమానులుగా చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళ్లి వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. 

Read more