కొడాలి నానీని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T06:32:07+05:30 IST

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి కొడాలి నానీని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని కోరుతూ అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన జరిగింది.

కొడాలి నానీని బర్తరఫ్‌ చేయాలి

మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

సెంట్రల్‌ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత 

మంత్రి ఫ్లెక్సీ దహనం.. వ్యతిరేక నినాదాలు

అజిత్‌సింగ్‌నగర్‌, జనవరి 21 : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి కొడాలి నానీని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని కోరుతూ అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన జరిగింది. గుడివాడ వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అ రెస్ట్‌ చేయడం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొం డా ఉమా కారును ధ్వంసం చేయడంపై నేతలు మం డిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకే్‌షతో పా టు మహిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, సభ్య సమా జం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి, నిప్పంటించారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకం గా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ తప్పు జరగలేదని భావిస్తే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని వైసీపీ నేతలు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానీని తక్షణమే బర్తరఫ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ తెలుగు మహి ళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ ఎందరో మహనీయులకు పుట్టినిల్లయిన గుడివాడ ప్రాంతాన్ని మంత్రి కొడాలి నానీ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మార్చేశారని విమర్శించారు. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌కు నేతగా చలామణి అవుతున్న మంత్రి కొడాలి నానీని గవర్నర్‌ తక్షణం బర్తరఫ్‌ చేయాలని కోరారు. నానీ నోరు అదుపులో పెట్టుకోకుంటే మహిళల చేతిలో బడితపూజ జరుగుతుందని హెచ్చరించారు. టీఎన్‌టీయూసీ మీడియా కో-ఆర్డినేటర్‌ పరుచూరి ప్రసాద్‌, నేతలు దాసరి కనకారావు, గరిమెళ్ల రాధిక, ఉదయశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:32:07+05:30 IST