టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-17T06:22:59+05:30 IST

టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

గుణదల, అక్టోబరు 16: టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. విజయవాడ రూరల్‌ మండలంలోని రామవరప్పాడులో తెలుగుదేశం పార్టీ గ్రామ చైతన్య కార్యక్రమం ఆదివారం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్జునుడు గ్రామంలో సభ్యత్వ నమోదు, ఓటరు లిస్టులను పరిశీలించారు.  అనంతరం నబీగారి కొండయ్య(కొండ)ను   టీడీపీ  గ్రామ అధ్యక్షుడిగా  నియమిస్తు న్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ బొప్పన హరికృష్ణ, నియో జకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు అద్దేపల్లి సాంబశివరావు నాగరాజు(సాంబు), జిల్లా ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు, మహిళా కార్యదర్శి బొమ్మసాని అరుణకుమారి, పట్టపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : పేదలకు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని, వారికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని టీడీపీ గన్న వరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అన్నారు. కోడూరుపాడు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరావు జన్మదినోత్సవ వేడుకల్లో ఆది వారం ఆయన పాల్గొన్నారు. గ్రామానికి చెందిన చిరువ్యాపారికి వ్యాపారిభివృద్ధి నిమి త్తం 5వేలు ఆర్ధికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో  అట్లూరి శ్రీనివాస్‌, గార్లపాటి రాజేశ్వరావు, చెన్నుబోయిన శివయ్య, మజిగ నాగరాజు, పొట్లూరి ఫణి, మండాది రవీంద్ర, మాలావత్తుల శ్రీనివాసరావు, మైలవరపు నాగరాజు, మొడబలిమి నాని, వరిగంజి తంబి, సీతారామస్వామి, బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T06:22:59+05:30 IST