గిరిజన గురుకులానికి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
ABN , First Publish Date - 2022-06-26T06:02:42+05:30 IST
ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్వచ్ఛ విద్యాలయం పురస్కారాన్ని పొందిన ఏకైక పాఠశాలగా జగ్గయ్యపేట గిరిజన గురకుల పాఠశాల నిలిచింది.

జగ్గయ్యపేట, జూన్ 25: ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్వచ్ఛ విద్యాలయం పురస్కారాన్ని పొందిన ఏకైక పాఠశాలగా జగ్గయ్యపేట గిరిజన గురకుల పాఠశాల నిలిచింది. రాష్ట్రంలోని విద్యాలయాల్లో కొవిడ్-19లో పాఠశాల నిర్వహణ, నాడు-నేడు అమలు, వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత తదితర ఎనిమిది అంశాలను నిపుణులు పరిశీలించి ఈ పురస్కారానికి ఎంపిక చే శారని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జాన్సన్ దేవరాజ్ తెలిపారు. అన్ని అంశాలో 5 స్టార్ రేటింగ్లో జిల్లాలో ఈ పురస్కారం పొందిన ఏకైక ఉన్నత పాఠశాలగా గుర్తించబడటం ఆనందంగా ఉందని దేవరాజ్ అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితో దీనిని సాధించామన్నారు. పురస్కారాన్ని ఉమ్మడి జిల్లా స్వచ్ఛ విద్యాలయ కో ఆర్డినేటర్, కృష్ణా కలెక్టర్ రంజిత్ బాషా నుంచి అందుకున్నట్టు తెలిపారు.