గాంధీనగర్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ కాంస్య విగ్రహం

ABN , First Publish Date - 2022-12-12T01:24:48+05:30 IST

సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని త్వరలో గాంధీనగర్‌లో ఏర్పాటు చేస్తామని ఎవర్‌గ్రీన్‌ హీరో కృష్ణ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దొంతరాజు బాబూరావు తెలిపారు. సత్యనారాయణపురంలోని సీతా రామ కల్యాణ మండపంలో ఆదివారం కృష్ణ సంతాప సభ నిర్వహిం చారు.

గాంధీనగర్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ కాంస్య విగ్రహం
కృష్ణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దొంతరాజు బాబూరావు, పందిరి కృష్ణ

సత్యనారాయణపురం, డిసెంబరు 11: సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరు అడుగుల కాంస్య విగ్రహాన్ని త్వరలో గాంధీనగర్‌లో ఏర్పాటు చేస్తామని ఎవర్‌గ్రీన్‌ హీరో కృష్ణ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దొంతరాజు బాబూరావు తెలిపారు. సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం కృష్ణ సంతాప సభ నిర్వహిం చారు. కృష్ణ చిత్రపటానికి అసోసియేషన్‌ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగులో తొలి కలర్‌ స్కోప్‌, 70ఎంఎం తెచ్చిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని బాబూరావు అన్నారు. సంతాప సభలో అభిమానులమంతా కృష్ణ కాంస్య విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. పందిరి కృష్ణ, లోల్లా కృష్ణమోహన్‌, బూదాల శ్యామ్‌సన్‌, నూకల నాగరాజు, ఇ.టైలర్‌ బాబు, వేట దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T01:24:48+05:30 IST

Read more