రైల్వేట్రాక్‌పై పడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-24T00:30:55+05:30 IST

స్థానిక రైల్వేస్టేషన్‌ ఉత్తరంవైపు నైజాంగేట్‌ స మీపంలో ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా తెలిసింది.

రైల్వేట్రాక్‌పై పడి యువకుడి ఆత్మహత్య

వన్‌టౌన్‌, నవంబరు 23 : స్థానిక రైల్వేస్టేషన్‌ ఉత్తరంవైపు నైజాంగేట్‌ స మీపంలో ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. మంగళవారం మ ధ్యాహ్నం ఘటన జరిగినట్టు రైల్వే పో లీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.ఆ యువకుడిని బ్లేడ్‌బ్యాచ్‌ వాళ్లే చంపి ఉంటారన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం మేరకు ముందుగా కీమాన్‌ అబ్దుల్‌ ఆజీమ్‌ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ఆర్‌ ప్రకాష్‌కు ఈ సమాచారం అందింది. ఆయన రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వే పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన షేక్‌ రహీం (27) గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం అదే ప్రాంతంలో గంజాయి ము ఠా సభ్యుడిని బ్లేడ్‌బ్యాచ్‌ హత్య చేసింది. పోలీసులు గుట్టుచప్పుడు కా కుండా మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించడంతో అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు. పోలీసుల నిఘా లోపంతో పాటు నైజాంగేట్‌ ట్రాక్‌ వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పోలీసులు తమ వద్ద డబ్బులు వసూలు చేశారని ఆ ప్రాంత స్థానికులు చెబుతున్నారు. ఏదైనా పోలీసుల నిఘా పటిష్టంగా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-24T00:30:55+05:30 IST

Read more