నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-03-17T20:28:47+05:30 IST

నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని శైలజానాథ్ తెలిపారు.

నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: శైలజానాథ్

విజయవాడ: జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఏపీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి సందర్శించలేదని విమర్శించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తామన్నారు. సీఎం జగన్ ప్యాలెస్‌లో కూర్చుంటే పాలన సాగదన్నారు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారని, అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు భయపడి సహజ మరణలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. జ్యూడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం చెందిందని, బాధితులకు రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే అందించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-17T20:28:47+05:30 IST