షాబాదను గ్రామకంఠంగా ప్రకటిస్తాం
ABN , First Publish Date - 2022-08-04T06:28:17+05:30 IST
జక్కంపూడి పంచాయతీ పరిధిలోని షాబాద గ్రామాన్ని గ్రామకంఠంగా ప్రకటించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు హామీ ఇచ్చారు.
కలెక్టర్ దిల్లీరావు
విజయవాడ రూరల్, ఆగస్టు 3 : జక్కంపూడి పంచాయతీ పరిధిలోని షాబాద గ్రామాన్ని గ్రామకంఠంగా ప్రకటించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు హామీ ఇచ్చారు. జక్కంపూడిలో ఎస్టీలకు రూ.83.60 లక్షలతో నిర్మించిన 22 గృహాలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలసి కలెక్టర్ బుధవారం పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం షాబాదలో కలెక్టర్ పర్యటించారు. ప్రజలు కలెక్టర్‌ను కలిసి ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. 1910 తర్వాత నుంచి షాబాదలో ఇళ్ల స్థలాలు క్రయ విక్రయాలు చేసుకుంటున్నా, రిజిస్ట్రేషన్ జరగడం లేదన్నారు. స్పందించిన కలెక్టర్ దిల్లీరావు, నివాస ప్రాంతాన్ని గ్రామ కంఠంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, వైస్ ఎంపీపీ వేమూరి సురేష్, జడ్పీటీసీ సభ్యుడు కె సువర్ణరాజు, గొల్లపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ కారంపూడి సురేష్, హౌసింగ్ పీడీ వీ శ్రీదేవి, డీఈఈ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో జె.సునీత, తహసీల్దార్ బి.సాయి శ్రీనివాస్ నాయక్, విద్యుత్‌శాఖ ఏడీ బాలాజీనాయక్, నున్న ఏఈ రాజశేఖర్, కార్యదర్శి భారతి, నాయకులు గంధ శ్రీనివాసరావు, లక్కింశెట్టి వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.