కందుకూరి ఆశయసాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-02-03T06:38:16+05:30 IST

సామాజిక చైతన్యానికి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం తన కృషితో వెలుగుబాట చూపారని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు, డాక్టర్‌ డి.లక్ష్మీనరసమ్మ అన్నారు.

కందుకూరి ఆశయసాధనకు కృషి చేయాలి
మాట్లాడుతున్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ డి.లక్ష్మీనరసమ్మ

కందుకూరి ఆశయసాధనకు కృషి చేయాలి

 ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 

ఆచార్యులు డాక్టర్‌ డి.లక్ష్మీనరసమ్మ 

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 2 : సామాజిక చైతన్యానికి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం తన కృషితో వెలుగుబాట చూపారని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు, డాక్టర్‌ డి.లక్ష్మీనరసమ్మ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో  బుధవారం సామాజిక అసమానతల నిర్మూలన - కందుకూరి వారి పాత్ర అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందస్సుకు ముఖ్యవక్తగా హాజరైన డాక్టర్‌ డి.లక్ష్మినరసమ్మ మాట్లాడుతూ నాటి సమాజంలో దారుణమైన పరిస్థితులను రూపుమాపేందుకు కందుకూరి విశేష కృషి చేశారన్నారు. తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి నిరంతరం శ్రమించారన్నారు. ప్రధానంగా మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలను దుయ్యబట్టి సమాజాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారన్నారు. మహిళోద్దరణ కోసం నడుం బిగించిన కందుకూరి ఆశించిన సమాజం నేటికి ఆవిష్కృతం కాలేదన్నారు. దాని కోసం నేటి తరం కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ సామాజిక చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు కందుకూరి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. తెలుగు విభాగాధిపతి శివయ్యనాయక్‌ సీనియర్‌ అధ్యాపకుడు జే.వి.చలపతిరావు తదితరులు ప్రసంగించారు.

Updated Date - 2022-02-03T06:38:16+05:30 IST