వైసీపీ పాలనలో ఎస్సీలపై పెచ్చుమీరిన దాడులు

ABN , First Publish Date - 2022-06-27T06:52:09+05:30 IST

వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడు లు, అత్యాచారాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో ఎస్సీలపై పెచ్చుమీరిన దాడులు

  ఎస్సీ సెల్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో

 మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 26 : వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడు లు, అత్యాచారాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.  మచిలీపట్నం టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంటు ఎస్సీ సెల్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది పార్లమెంటు ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా మాచవరపు ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా గడిదేసి రవి, నిమ్మకూరి మధుబాబు, పులి విజయబాబు, మదిరి అభిమన్యుడు, గుంటూరు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా పాముల శ్రీనివాసరావు, అధికార ప్రతినిఽధులుగా కలపాల కుమార్‌, కె. కిషోర్‌, గుంటూరు వినయ్‌ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నూతనంగా ఎన్నికైన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు.   మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌,  మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, కార్పొరేటర్‌ దేవరపల్లి అనిత, లంకిశెట్టి వనజ, ఎన్‌. వసంతకుమారి, చిట్టూరి యువరాజ్‌, బురకా బాలాజీ పాల్గొన్నారు 

Updated Date - 2022-06-27T06:52:09+05:30 IST