రేపు రాజభవన్ ముందు నిరసన: సాకే శైలజనాధ్

ABN , First Publish Date - 2022-06-16T00:59:22+05:30 IST

Vijayawada: నేషనల్ హెరాల్ట్ దినపత్రికకు సంబంధించిన కేసులో రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు

రేపు రాజభవన్ ముందు నిరసన: సాకే శైలజనాధ్

Vijayawada: నేషనల్ హెరాల్ట్ దినపత్రికకు సంబంధించిన కేసులో రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా రేపు రాజభవన్  ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే బీజేపీ ఉనికి ప్రమాదంలో పడుతుందనే భయం పట్టుకుందని, ప్రశ్నించే గొంతుకలను బీజేపీ అణచి వేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బేషరతుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ చేసే చర్యలకు రేపు ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2022-06-16T00:59:22+05:30 IST