రైతుల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే వంశీ

ABN , First Publish Date - 2022-03-05T06:19:53+05:30 IST

రైతుల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే వంశీ

రైతుల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే వంశీ
ఎమ్మెల్యే వంశీని సత్కరిస్తున్న మాదలవారిగూడెం రైతులు

 గన్నవరం, మార్చి 4 : రైతుల సంక్షేమమే ధ్యేయ మని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మండలంలోని మాదలవారిగూడెం గ్రామానికి చెందిన 32 మంది రైతులు  శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి పూలబొకే అందజేసి సన్మానించారు. పూర్వికులంతా కలసి తమ ప్రైవేటు భూమిలో సాగునీటి వసతి కోసం చెరువును తవ్వుకు న్నారు. వ్యవసాయ భూమి కాస్త చెరువుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ప్రస్తుతం అందరికీ బోర్లు ఉన్న పరిస్థితుల్లో చెరువు అవసరం లేదని, ఆ చెరువు కూడా నీరు చేరటం లేదని ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో చెరు వుగా చూపుతున్న దానిని తొలగించాలని కోరుతూ ఎమ్మెల్యేకి గతంలో వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ ఉన్న తాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేశారు. రెవెన్యూ రికార్డుల నుంచి చెరువును తొలగించి వ్యవసాయ భూమిగా ఎఫ్‌ఎంబీలో వచ్చేలా ఎమ్మెల్యే వంశీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తు తమకు అండగా ఉండి న్యాయం చేసిన ఎమ్మెల్యే వంశీకి, తహశీల్దార్‌ నరసింహారావుకు పూలబొకే, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ అనగాని రవి, జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, మాజీ వైస్‌ ఎంపీపీ గొంది పరంధామయ్య, ఎంపీటీసీ మరీదు లక్ష్మీ దుర్గ, మేచినేనిబాబు, మాదల రవి ప్రసాద్‌, రంగనాద్‌, రాంబాబు, తుల్లిమిల్లి సుబ్బారావు, కొల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:19:53+05:30 IST