Road accident: కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..నలుగురికి గాయాలు
ABN , First Publish Date - 2022-12-07T07:27:23+05:30 IST
హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవేపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది
కృష్ణాః హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవేపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సాయంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.