రీ సర్వేతో దీర్ఘకాల భూ సమస్యలకు పరిష్కారం

ABN , First Publish Date - 2022-12-07T00:53:56+05:30 IST

భూములకు సంబంధించి రీసర్వేతో దీర్ఘకాల భూసమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు.

 రీ సర్వేతో దీర్ఘకాల భూ సమస్యలకు పరిష్కారం
రైతులకు శాశ్వత హక్కుపత్రం అందిస్తున్న జేసీ నుపూర్‌, తదితరులు

ఆంజనేయపురం(తిరువూరు), డిసెంబరు 6: భూములకు సంబంధించి రీసర్వేతో దీర్ఘకాల భూసమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. ఆంజనేయపురం గ్రామంలో మీ భూమి మా హామీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శాశ్వత భూహక్కు పత్రాల జారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ నుపూర్‌ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో డ్రోన్‌ల ద్వారా భూముల రీసర్వే నిర్వహించటం జరిగిందన్నారు. 14 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు. 1467 రైతుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం గ్రామంలో 112 మంది రైతులకు శాశ్వత భూమిహక్కు పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్‌ నూతక్కి సురేష్‌బాబు, సర్పంచ్‌ మామిడి కుటుంబరావు, జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శీలం నాగనర్సిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:53:58+05:30 IST