రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు

ABN , First Publish Date - 2022-06-07T06:44:19+05:30 IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు

రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు
పురుషోత్తపట్నంలో కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ అర్జునుడు

 ప్రతి ఇంటికి టీడీపీ,  బాదుడే బాదుడులో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

గన్నవరం, జూన్‌ 6 : రాష్ట్రంలో శాంతి భద్రత లు కరువయ్యాయని, బలహీన వర్గాలను హత్య చేయడమే సామాజిక న్యాయమా అని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మండలంలోని పురుషోత్తపట్నంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం, బాదుడే బాదుడు కార్యక్ర మాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ జల్లయ్య యాదవ్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలన కొనసా గుతుందన్నారు.  జల్లయ్య కుటుంబానికి టీడీపీ రూ.25లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్‌ ఈ మూడేళ్లలో 37మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని వారిలో 26 మంది బీసీ వర్గాలకు చెందిన వారన్నారు. ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులను హత్యలు చేస్తూ సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు చేయడానికి జగన్‌, మంత్రులకు సిగ్గుండాలన్నారు. ఇంటింటికి వెళ్లి పెరిగిన ధర లను వివరిస్తూ కరపత్రాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు గుమ్మడి వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి శ్రీనివాస రావు, కొమ్మినేని రాజా, రావెల కృష్ణప్రసాద్‌, గోగినేని గోపాలరావు, నక్కా శ్రీను, వల్లూరు సోములు, గుమ్మడి చందు, కొమ్మినేని సుధీర్‌, నువ్వుల రామస్వామి, సీతారామయ్య, జాస్తి వెంకటేశ్వరరావు, గూడవల్లి నరసయ్య, గుజ్జర్లపూడి బాబూరావు, మండవ లక్ష్మీ, చిక్కవరపు నాగమణి, బుస్సే సరిత, తంగిరాల మల్లేశ్వరీ పాల్గొన్నారు. 

విద్యుత్‌ చార్జీల పెంపులో రికార్డు  

పెనమలూరు : వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుమారు ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రికార్డు సృష్టించారని, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అను మోలు ప్రభాకరరావు అన్నారు. సోమవారం తాడిగడపలోని 36వ డివిజన్‌లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభా కరరావు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఉండేదని ఇప్పుడు నిత్యం విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడు తున్నారన్నారు. పన్నుల పేరిట ప్రజల దగ్గర నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దోనేపూడి రవికిరణ్‌, మొక్కపాటి శ్రీను, మాదు శోభన్‌, కాట్రగడ్డ లాలీప్రసాద్‌, కన్నెగంటి రాజా, ఇక్బాల్‌, మేడసాని రత్న కుమారి, తాడపనేని సుబ్బారావు, కోండ్ర కోటేశ్వరరావు, చిరుమామిళ్ల శివ శంకర్‌, గుర్రం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Read more