రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-10-03T06:20:34+05:30 IST

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

పెనమలూరు, అక్టోబరు 2 :  జగన్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం తాడిగడప మునిసిపాలిటీ పదవ వార్డులో జరిగిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిత్యావసరాల ధరలు, పెట్రోలు డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం జేశారు. బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా ఇబ్బందు లు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చెప్పే కరపత్రాలను ప్రజలకు పంచి పెట్టారు. ప్రభుత్వ వైఫల్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట టీడీపీ పదవ వార్డు అధ్యక్షుడు సరిహద్దు కోటేశ్వరరావు, తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మేడసాని రత్నకుమారి, ఐటీడీపీ కోఆర్డినేటరు రావి రాకేష్‌ చౌదరి  ఉన్నారు. 

Read more