రాష్ట్రంలో దోపిడీ పాలన

ABN , First Publish Date - 2022-09-17T06:38:49+05:30 IST

రాష్ట్రంలో దోపిడీ పాలన

రాష్ట్రంలో దోపిడీ పాలన
తాడిగడపలో జరిగిన బాదుడే బాదుడులో కరపత్రాలు పంచుతున్న బోడె ప్రసాద్‌, అనుమోలు ప్రభాకరరావు

పెనమలూరు, సెప్టెంబరు 16 : రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందని, ప్రజా ధనం దోచుకో వటంలో వైసీపీ నాయకులు పోటీ పడుతున్నారని, జగన్‌ పాలనకు త్వర లోనేప్రజలు చరమగీతం పాడా నున్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. తాడిగడప మునిసిపాలిటీ నాల్గవ వార్డులో బాదు డే బాదుడు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు రెట్టింపయ్యాయన్నారు. జగన్‌ వేలకోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల దృష్టికి తెచ్చే కరపత్రాలను పంచి పెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, అంగిరేకుల మురళి, చిగురుపాటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల ఉన్నతికి కోడెల కృషి మరువలేనిది

పల్నాడు ప్రాంతంలో పేదల అభ్యున్నతికి దివంగత స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చేసిన కృషి మరువలేనిది అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కోడెల శివప్రసాద్‌ మూడవ వర్ధంతిని స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కోడెల అంతిమ శ్వాస వరకు పార్టీ బలోపేతానికి  పాటుబడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, అంగిరేకుల మురళి, దొంతగాని పుల్లేశ్వరరావు, సూదిమళ్ల రవీంద్రప్రసాద్‌, వెలగపూడి శంకరబాబు, కుర్రా నరేంద్ర, సయ్యద్‌ ఇబ్రహీం, దోనవల్లి వెంకట సుబ్బారావు, పులి శ్రీనివాస్‌, సిరిగిరి మధుసూదనరావు,  శివరాంప్రసాద్‌, బొంగరాల అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.

Read more