రామలింగేశ్వరస్వామి ఆదాయం 29.17 లక్షలు

ABN , First Publish Date - 2022-03-05T06:13:42+05:30 IST

రామలింగేశ్వరస్వామి ఆదాయం 29.17 లక్షలు

రామలింగేశ్వరస్వామి ఆదాయం 29.17 లక్షలు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, భక్తులు

పెనమలూరు, మార్చి 4: మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు రామలింగేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. ఆ ఆ వివరాలను ఈవో బి. గంగాధరరావు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.12,57,593, దేవస్థాన ప్రభ పాట ద్వారా రూ. 2.35 లక్షలు, కట్న కానుకలు, చదివింపుల ద్వారా రూ.6,31,635, విరాళాల ద్వారా రూ. 1,95, 581 భక్తులు స్వామి వారికి సమర్పించి నట్లు తెలిపారు. పూజల ద్వారా రూ.1, 50, 672, ప్రత్యేక దర్శనం రూ. 100 టిక్కెట్స్‌ ద్వారా రూ. 4,46, 900 వచ్చినట్లు తెలిపారు.

 మొత్తం రూ. 29,17,381 ఆదాయం వచ్చినట్లు గంగాధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Read more