అమరావతి పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరించారు: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2022-03-04T19:09:34+05:30 IST
ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం మందడంలో రైతుల శిబిరంలో ఆయన మాట్లాడుతూ అమరావతి పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. జగన్కు చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలన్నారు. ఇక మంత్రి బొత్స సత్యన్నారాయణ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదన్నారు. రాజధాని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలు లేవా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్ హైకోర్టు తీర్పును గౌరవించాలని రామకృష్ణ సూచించారు.