వీడని వాన

ABN , First Publish Date - 2022-10-07T06:28:11+05:30 IST

వీడని వాన

వీడని వాన

రెండు రోజులుగా నగరాన్ని తడిపేసిన వాన

రోడ్లన్నీ జలమయం

ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా..

భారీ వర్షంలో భవానీలకు ఇబ్బందులు


విజయవాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడటంతో జిల్లాలో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో బుధవారం 658.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సరాసరి 32.91గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలో 45 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా తిరువూరులో 19.8 మిల్లీమీటర్లు నమోదైంది. ఇక జి.కొండూరులో 44.20 మిల్లీమీటర్లు, పెనుగంచిప్రోలులో 43.6, జగ్గయ్యపేటలో 40.2, మైలవరంలో 38.6, కంచికచర్లలో 37.6, ఎ.కొండూరులో 35.6, వీరులపాడులో 34.4, నందిగామలో 32.4, విజయవాడ రూరల్‌లో 32.4, విస్సన్నపేటలో 30.6, గంపలగూడెంలో 29.8, విజయవాడ సెంట్రల్‌లో 29.2, విజయవాడ నార్త్‌లో 29.2, విజయవాడ వెస్ట్‌లో 29.2, చందర్లపాడులో 28.6, విజయవాడ తూర్పులో 28.4, రెడ్డిగూడెంలో 25.2, వత్సవాయిలో 24.2, తిరువూరులో 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

అంతా జలమయం

భారీ వర్షాలకు నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి వచ్చిన భవానీలు అనేక ఇబ్బందులు పడ్డారు. 

Read more