కన్నీటి వాగులు..!
ABN , First Publish Date - 2022-08-04T06:43:54+05:30 IST
వాగులపై వంతెనలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.. వర్షాలు వస్తే వాగులు పొంగటంతో గ్రామస్థులు బయటకు ఆస్కారం లేదు.. వంతెనలు నిర్మించండి మహోప్రభో అంటూ వేడుకుంటున్నప్పటికీ ప్రయోజనం శూన్యం.. ప్రమాదం జరిగినపుడు అయ్యో పాపం అనటం తప్ప పాలకులు, అధికారులు ఏమాత్రం స్పందించటం లేదని చెవిటికల్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలంలో కృష్ణానది వెంబడిఉన్న గ్రామాల్లో చెవిటికల్లు ఒకటి. ఇక్కడ నది మూడు కిలోమీటర్లకు పైగా వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ఈ గ్రామం మీదుగానే గుంటూరు జిల్లా అమరావతికి రాకపోకలు సాగేవి. కంచికచర్ల నుంచి చెవిటికల్లు వెళ్లే ప్రధానమైన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఆర్అంబీ అధీనంలో ఉంది. ఈ గ్రామం మొదట్లో రెండు వాగులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఐదారు అడుగులకు పైగా లోతులో లోలెవల్ కాజ్వేలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎగువ పంట భూముల నుంచి వచ్చే నీరు, ఈ వాగుల ద్వారా నదిలో కలుస్తుంది. వరదలు వచ్చినపుడు కృష్ణానది నీరు ఈ వాగులకు ఎగదాపు అవుతుంది. వరదల సమయంలో, భారీ వర్షాలు పడినపుడు రెండు వాగుల్లో పది అడుగులకు పైగా ఎత్తున వరదనీరు చేరుతున్నది. ముప్పా
- చిన్న వర్షానికే రోడ్డెక్కుతున్న వాగులు
- ఫిర్యాదులు చేసినా పట్టని పాలకులు
- వంతెనల ప్రతిపాదనలు బుట్ట దాఖలు
- వరదలు వస్తే పడవలపైనే ప్రయాణం
- ప్రమాదమొస్తే పరామర్శలకు ముందు..
- చెవిటికల్లు గ్రామస్థుల ఆవేదన
కంచికచర్ల, ఆగస్టు 3 : వాగులపై వంతెనలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.. వర్షాలు వస్తే వాగులు పొంగటంతో గ్రామస్థులు బయటకు ఆస్కారం లేదు.. వంతెనలు నిర్మించండి మహోప్రభో అంటూ వేడుకుంటున్నప్పటికీ ప్రయోజనం శూన్యం.. ప్రమాదం జరిగినపుడు అయ్యో పాపం అనటం తప్ప పాలకులు, అధికారులు ఏమాత్రం స్పందించటం లేదని చెవిటికల్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలంలో కృష్ణానది వెంబడిఉన్న గ్రామాల్లో చెవిటికల్లు ఒకటి. ఇక్కడ నది మూడు కిలోమీటర్లకు పైగా వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ఈ గ్రామం మీదుగానే గుంటూరు జిల్లా అమరావతికి రాకపోకలు సాగేవి. కంచికచర్ల నుంచి చెవిటికల్లు వెళ్లే ప్రధానమైన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఆర్అంబీ అధీనంలో ఉంది. ఈ గ్రామం మొదట్లో రెండు వాగులు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఐదారు అడుగులకు పైగా లోతులో లోలెవల్ కాజ్వేలు ఉన్నాయి. వర్షాకాలంలో ఎగువ పంట భూముల నుంచి వచ్చే నీరు, ఈ వాగుల ద్వారా నదిలో కలుస్తుంది. వరదలు వచ్చినపుడు కృష్ణానది నీరు ఈ వాగులకు ఎగదాపు అవుతుంది. వరదల సమయంలో, భారీ వర్షాలు పడినపుడు రెండు వాగుల్లో పది అడుగులకు పైగా ఎత్తున వరదనీరు చేరుతున్నది. ముప్పావు కిలోమీటరు దూరం రోడ్డు పైకి నీరు చేరుతున్నది. వాగులు పోటెత్తినపుడు గ్రామస్థులు బయటకు రావటానికి వీలుపడదు. గ్రామం ద్వీపంలా మారుతుంది. మరో మార్గం లేక పడవలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇంతకు ముందు వాగుల వద్ద ప్రమాదాలు కూడా జరిగాయి. మూడేళ్ల క్రితం జరిగిన నాటు పడవ ప్రమాదంలో 13 సంవత్సరాల బాలిక మృతిచెందింది. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వాగుల వద్ద ఎత్తైన వంతెనలు నిర్మించాల్సిందిగా గ్రామస్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. పాలకులకు, అధికారులకు అందచేసిన వినతిపత్రాలు బుట్టదాఖలా అయ్యాయి తప్పితే ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఆర్అండ్బీ అధికారులు వంతెనల నిర్మాణానికి తయారుచేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఎప్పటికప్పుడు వాగ్ధానాలతో కాలం గడుపుతున్నారు గాని ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి వాగుల వద్ద వంతెనలు నిర్మించాలని మాజీ సర్పంచ్లు కొర్లగుంట బుచ్చయ్య, కోగంటి విష్ణువర్ధనరావులతో పాటుగా గ్రామస్థులు ముక్తంకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.
