రేపటి నుంచి మూడ్రోజులు వర్షాలు
ABN , First Publish Date - 2022-12-07T00:00:51+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం సాయంత్రానికి తుపాను మారుతుందని, 8, 9, 10 తేదీల్లో దక్షిణ కోస్తాతీరం వెంబడి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం సాయంత్రానికి తుపాను మారుతుందని, 8, 9, 10 తేదీల్లో దక్షిణ కోస్తాతీరం వెంబడి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో ఈనెల 8వ తేదీ నుంచి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు పంటను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వరికోతలను దాదాపుగా నిలిపివేశారు. పోలాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనులను చేపట్టారు. రైతుల వద్ద ధాన్యంను మిల్లులకు చేరవేసేందుకు తీసుకోవాల్సిప చర్యలపై జేసీ అపరాజితా సింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వాహనాలను సమకూర్చాలని సూచన చేశారు. ఉయ్యూరు, కంకిపాడు, పెడన, మచిలీపట్నం, గూడూరు, గుడివాడ, తదితర ప్రాంతాల్లో తహసీల్దార్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు లారీలను కొంతమేర సమకూర్చే పనులు చేపట్టారు. ధాన్యం విక్రయించే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే జేసీ కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్ నెంబరు 96520 14457కు తెలియజేయాలని పౌరసరఫరాలశాఖ జల్లా మేనేజరు శ్రీఽధర్ తెలిపారు.