బస్‌ షెల్టర్‌ నిర్మించాలని కోరుతూ నిరసన

ABN , First Publish Date - 2022-12-31T00:19:27+05:30 IST

కండ్రిక కాలనీలో బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారని ఐద్వా సెంట్రల్‌ కార్యదర్శి జి. ఝాన్సీ అన్నారు.

బస్‌ షెల్టర్‌ నిర్మించాలని కోరుతూ నిరసన

బస్‌ షెల్టర్‌ నిర్మించాలని కోరుతూ నిరసన

పాయకాపురం, డిసెంబరు 30 : కండ్రిక కాలనీలో బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారని ఐద్వా సెంట్రల్‌ కార్యదర్శి జి. ఝాన్సీ అన్నారు. 64వ డివిజన్‌లోని కండ్రికలో బస్‌ షెల్టర్‌ నిర్మించాలని కోరుతూ ఐద్వా, డీవైఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన నిర్వహించి, అనంతరం సంతకాల సేకరణ చేసి సచివాలయ సిబ్బందికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని, ప్రజాశక్తినగర్‌, రాధానగర్‌, కండ్రిక మూడు ప్రాంతాల జంక్షన్‌లో రిక్వెస్ట్‌ స్టాప్‌ ఏర్పాటు చేయాలని కోరారు. జి. లత, పిచ్చమ్మ, సావిత్రి, పద్మ, భూలక్ష్మి, జి. సతీష్‌, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:19:27+05:30 IST

Read more