సర్వే పరీక్ష ఉత్తీర్ణులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T01:07:25+05:30 IST

సర్వే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి పేస్కేల్‌ ఇవ్వాలని, ఉత్తీర్ణులు కాని వారికి 13 జీవో సర్వీస్‌ నిబంధనలు అమలు చేసి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసేలా చూడాలని ఏపీ వీఆర్వోల అసోసియేషన్‌ అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్‌ చేశారు.

సర్వే పరీక్ష ఉత్తీర్ణులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి
ఇంతియాజ్‌కు వినతిపత్రం ఇస్తున్న వీఆర్వో సంఘ నాయకులు

కృష్ణలంక, డిసెంబరు 30: సర్వే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి పేస్కేల్‌ ఇవ్వాలని, ఉత్తీర్ణులు కాని వారికి 13 జీవో సర్వీస్‌ నిబంధనలు అమలు చేసి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసేలా చూడాలని ఏపీ వీఆర్వోల అసోసియేషన్‌ అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శి ఇంతియాజ్‌కు అసోసి యేషన్‌ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం ఇచ్చారు. పదిహేనేళ్లు వీఆర్‌ఏలుగా చేసి రెండేళ్ల నుంచి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా రూ.15 వేల జీతం తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. సంఘం రాష్ట్ర నాయకులు వాస దివాకర్‌, మిరియాల లక్ష్మీనారాయణ, కొవ్వూరు డివిజన్‌ అధ్యక్షుడు ఎజ్జర్ల ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:07:25+05:30 IST

Read more