ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

ABN , First Publish Date - 2022-12-31T00:50:51+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా అ న్నారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో సుల్తానా

కంకిపాడు, డిసెంబరు 30 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా అ న్నారు. మండలంలోని తెన్నేరు లో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శినిలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఎంఈవో కనకమహాలక్ష్మి, హెచ్‌ఎం హనుప్రసాద్‌, ఈవో కూర్మారావు పాల్గొన్నారు.

పెనమలూరు : జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఉయ్యూరు ఆర్డీవో విజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్డీవో వణుకూరులోని వెల్‌నెస్‌ సెంటర్లను, రైతు భరోసా కేంద్రాన్ని, రక్షిత మంచినీటి పథకాలను, పాఠశాలలను సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీతాశర్మ, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, హౌసింగ్‌ ఏఈ సత్యనారాయణరాజు, ఏపీఎం భూషణం, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ నాంచార్రావు తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామదర్శిని అమలు చేస్తున్నట్లు ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండలంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. మానికొండలో మెప్మా పీడీ ఎస్‌.ఎన్‌.విశాలాక్ష్మి, తరిగొప్పలలో జిల్లా రిజిస్ట్రార్‌ టి.ఉపేంద్రరావు, పొట్టిపాడులో డీఎల్పీవో ఐ.జ్మోతిర్మయి, పొణుకుమాడులో డీవైఈవో పి.వినయ్‌కుమార్‌లు పర్యటించి, ఆయాగ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులు, ప్రభుత్వపథకాల అమలుపై స్ధానిక అధికారులను ఆరా తీశారు.

Updated Date - 2022-12-31T00:50:53+05:30 IST