పోతిరెడ్డిపాలెంలో బాదుడే.. బాదుడు
ABN , First Publish Date - 2022-06-29T06:50:35+05:30 IST
ప్రజలపై పెనుభారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వంపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కుంచే నాని అన్నార పోతిరెడ్డిపాలెంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మచిలీపట్నం టౌన్ : ప్రజలపై పెనుభారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వంపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కుంచే నాని అన్నార పోతిరెడ్డిపాలెంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సాగునీరు, తాగునీరు సరిగా అందడం లేదని, అమ్మఒడి కొందరికి నమోదు కాలేదని ప్రజలు తెలిపారు. తలారి సోమశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ రుణాలు అందడం లేదన్నారు. నాయకులు విజయ్, బెజవాడ శ్రీమన్నారాయణ, కాసాని విష్ణు, కొండేటి అర్జునరావు, కాగిత శేషు, కమ్మిలి మధు, కాగిత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు