ప్రతి విషయాన్నీ రాజకీయం చేయొద్దు

ABN , First Publish Date - 2022-08-01T06:01:38+05:30 IST

జనసేన పార్టీ నేత గుడివాక శేషుబాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేసే నైజాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు.

ప్రతి విషయాన్నీ రాజకీయం చేయొద్దు

 ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు

అవనిగడ్డ టౌన్‌, జూలై 31 : జనసేన పార్టీ నేత గుడివాక శేషుబాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేసే నైజాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని మండలిపురం ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ గుడివాక శేషుబాబు తననూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డినీ పనికిమాలినవారంటూ వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి ఉద్దేశం ఏమిటో ప్రజలే గమనించాలని అన్నారు. తొలుత మండలిపురంలో జరుగుతున్న మురుగునీటి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలిపురం ప్రాంతం కాలనీగా ఏర్పడి 13 ఏళ్లు కావొస్తుందని, అక్కడ గత ప్రభుత్వాలు కనీస వసతులు కల్పించకపోవటంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

Read more