పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-09-27T06:09:24+05:30 IST

ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వి ధుల్లో ఉన్న సిబ్బందిని హాజరు కానివ్వకుండా భంగం కలిగిస్తున్నారు.

పోలీసుల అత్యుత్సాహం
బారికేడ్ల వద్ద విధుల్లోకి వస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పోలీసులు,

దుర్గగుడి సిబ్బందినీ విధులకు అనుమతించని వైనం

సబ్‌ కలెక్టర్‌ జోక్యంతో వివాదం పరిష్కారం

 పాయకాపురం, సెప్టెంబరు 26 : ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వి ధుల్లో ఉన్న సిబ్బందిని హాజరు కానివ్వకుండా భంగం కలిగిస్తున్నారు. దీంతో తొలిరోజు పోలీసులకు, ఆలయ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది అధికారులకు డ్యూటీ పాస్‌లు జారీ చేసి న అధికారులు సదరు డ్యూటీ పాస్‌లలో అధికారుల వాహనాలు నేరుగా విధులు నిర్వహించే ప్రదేశానికి అనుమతి జారీచేశారు. పాస్‌లలో ఆ వివరాలు పూర్తి గా కనిపిస్తున్నా కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో వారి వాహనాలను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో అసహనాని కి గురైన కొంతమంది అధికారులు విషయాన్ని పై అ ధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమాచారం అందుకు న్న జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. నుపూర్‌ అజయ్‌, సిబ్బందితో స్వయంగా బారికేడ్ల వద్దకు చేరుకుని పోలీసుల తీరును పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. 

కేశఖండనశాలలో సిబ్బంది చేతివాటం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తుల జేబులకు చి ల్లులు పడుతున్నాయి. ఇంద్రకీలాద్రి దిగువున ఏర్పా టు చేసిన కేశఖండన శాలలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి టోకెన్‌ డబ్బు కాకుండా అదనంగా రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాలు, పల్లెటూళ్ల నుంచి వస్తున్న నిరుపే ద భక్తులు వారు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నారు. అమ్మవారి మొక్కు తీర్చుకున్నప్పటికీ క్షురకుల చేతులు తడవకపోవడంతో వారనే మాటలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు దీనిపై దృష్టి పెట్టి పరిష్కార చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

వలంటీర్లూ.. జాగ్రత్త!

పాతరాజరాజేశ్వరి పేట : దసరా ఉత్సవాల్లో భా గంగా భక్తుల సేవార్థం నగరంలోని కళాశాల విద్యార్థులు అమ్మవారి సేవలో పాల్గొంటారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డులోని క్యూలైన్‌లో విద్యార్థులు భక్తులకు వాటర్‌ ప్యాకెట్లను అందజేస్తున్నారు. కానీ కొంతమంది విద్యార్థినులు క్యూలైన్‌లోని బారికేడ్లు ఎక్కి మరీ భక్తులకు వాటర్‌ ప్యాకెట్లను అందజేస్తున్నారు. అయితే విద్యార్థినులు కాస్త జాగ్రత్తగా అమ్మవారి సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దెబ్బలు తగించుకునే పరిస్థితికి దూరంగా ఉండాలి.

ప్రధానాలయంలో అవతారమే కుంకుమ పూజల వద్ద..!

విజయవాడ : శరన్నవరాత్రుల్లో మహా మండపంలోని ఆరో అంతస్తులో జరిగే కుంకుమ పూజల వద్ద అర్చకులు ఈ ఏడాది కొత్త ప్రయోగం చేశారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని రోజుకు ఓ అవతారంలో అలంకరిస్తారు. తొలిరోజున ఉత్సవ మూర్తుకు ప్రాణప్రతిష్ట చేసి పల్లకీలో ఆరో అంతస్తుకు తీసుకొస్తారు. అక్కడే కుంకుమార్చనలు చేస్తారు. ఈ ఏడాది ప్రధాన ఆలయంలో అమ్మవారికి చేసే అలంకారాన్నే కుంకుమ పూజల్లో ఉండే ఉత్సవ మూర్తులకు చేస్తా రు. దీన్నిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more