కృష్ణా జలాలకు రూ.38 కోట్లతో పైలెట్ ప్రాజెక్టు
ABN , First Publish Date - 2022-09-15T07:19:12+05:30 IST
.కొండూరు మండలంలోని తండాలకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.38 కోట్లతో పైలెట్ ప్రాజెక్టు చెపట్టడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు అన్నారు.
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు
తిరువూరు, సెప్టెంబరు 14 : ఎ.కొండూరు మండలంలోని తండాలకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.38 కోట్లతో పైలెట్ ప్రాజెక్టు చెపట్టడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు అన్నారు. బుధవారం పట్టణంలో గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.1.30 కోట్లతో నిర్మించిన డయాలసీస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతు, కిడ్ని వ్యాధిగ్రస్తులతో ఎ.కొండూరుమండలం మరో ఉద్దానంగా మారుతుందనే వ్యాఖ్యలు నివిపిస్తున్నాయన్నారు. ఈప్రాంతంలో 87 హెబిటేషన్లలో భూగర్భజలాలు పరీక్షించగా సుమారు 72 హెబిటేషన్లలో సిలికాన్ అధికంగా ఉన్నట్టు నివేదికలు వచ్చినట్టు తెలిపారు. కిడ్ని వ్యాధి బారిన పడకుండా కాలనీవాసులు శుద్ధిచేసిన నీటిని వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఎ.కొండూరు ప్రాంతానికి పైలెట్ ప్రాజెక్టు నివేదిక ఆర్థిక శాఖకు వెళ్లిందన్నారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ, తిరువూరులో ఈ కేంద్రం ఏర్పాటుతో అన్ని మండలాల్లోని డయాలసీస్ రోగులకు అందుబాటులో ఉంటుందనే ఉద్ధేశంతోనే పట్టణంలో కేంద్రం ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని వివిధ రకాల భూములకు సంబంధించిన సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ గత్తం కస్తూరిబాయి, గిరిజన సంక్షేమశాఖ అధికారి రుక్మంధయ్య, తహసీల్దార్ సురే్‌షబాబు, ఎంపీడీవో పివిఎ్‌స.నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.