పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడలో కలపాలి
ABN , First Publish Date - 2022-03-04T06:45:41+05:30 IST
పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడలో కలపాలి
ఉయ్యూరు, మార్చి 3: పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలో కలిపి పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలను విజయవాడ డివిజన్‌లో చేర్చాలని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. కలెక్టర్ నివాస్‌ను గురువారం విజయవాడలో అఖిలపక్ష నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. పెనమలూరు నియోజకవర్గాన్ని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లాలో కలిపితే నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. సీపీఐ నాయకుడు నార్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకుడు కాకాని లోకేష్, నెరుసు వెంకటేశ్వరరావు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.