పెనమలూరును విజయవాడ జిల్లాలో కలపాలి
ABN , First Publish Date - 2022-02-28T06:42:44+05:30 IST
పెనమలూరును విజయవాడ జిల్లాలో కలపాలి
పెనమలూరు, ఫిబ్రవరి 27: పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలో కలపాలంటూ టీడీపీ నేత దేవినేని గౌతమ్ ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడిగడప సెంటర్ నుంచి బందరు రోడ్డు మీదుగా పోరంకి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. పెనమలూరు నియోజకవర్గాన్ని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్న 300 మంది నుంచి సంతకాలను సేకరించారు. త్వరలో సబ్ కలెక్టర్‌ను కలిసి పెనమలూరును విజయవాడ జిల్లాలో కలపాలని వినతిపత్రం అందించనున్నట్లు దేవినేని గౌతమ్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బొగ్గవరపు శ్రీనివాస్, యలవర్తి అనిల్, నందమూరి నాగేశ్వరరావు, కొండ్రు కోటేశ్వరరావు, పోలవరపు కుమార్, రావి సురేష్ పాల్గొన్నారు.