పవన్ కల్యాణ్‌ను అరెస్టు చేస్తే ఉద్యమం : జనసేన
ABN , First Publish Date - 2022-10-17T06:56:01+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ హెచ్చరించారు.
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 16 : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ హెచ్చరించారు. అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో పాదయాత్రలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను ఏ ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసిన దాఖలాలు లేవన్నారు. యాత్రలపై ఆంక్షలు విధించలేదన్నారు. వైసీపీ నాయకులు తమకు తామే రాళ్లతో దాడులు చేసుకుని జనసేన కార్యకర్తలు దాడులు జరిపారని చెప్ప డం పెద్ద డ్రామా అన్నారు. జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా ఆడారని, మళ్లీ మూడు రాజధానుల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. జనసేన నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. హోమ్ మినిష్టర్ వెంటనే రాజీనామా చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.