పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ABN , First Publish Date - 2022-08-19T06:26:02+05:30 IST
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
కడవకొల్లు/ముదునూరు (ఉయ్యూరు), ఆగస్టు 18 : పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకో వాలసిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిం చాలని ఆరోగ్య సిబ్బందిని ఎంపీడీవో జె. విమా దేవి ఆదేశించారు. కడవకొల్లులో వెల్‌నెస్ సెంట ర్‌ను గురువారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశిం చారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం ముదునూరులో గ్రామ సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించారు. వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే వారికి సత్వర సేవలందించాలని ఆదేశించారు. ఈవో పీఆర్డీ మైథిలీ తదితరులు పాల్గొన్నారు.