పాడిరైతుకు కృష్ణామిల్క్ యూనియన్ సహకారం : చలసాని
ABN , First Publish Date - 2022-12-15T01:22:16+05:30 IST
పాడిరైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తూ అండగా కృష్ణామిల్క్ యూనియన్ నిలబడుతుందని చైర్మన్ చల సాని ఆంజనేయులు అన్నారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్, డిసెంబరు 14 : పాడిరైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తూ అండగా కృష్ణామిల్క్ యూనియన్ నిలబడుతుందని చైర్మన్ చల సాని ఆంజనేయులు అన్నారు. కాకులపాడులో పాడిరైతు కుటుం బాలకు కల్యాణమస్తు బంగారు నాణేలను బుధవారం ఆయన ఆందజేశారు. కాకులపాడు పాల సొసైటీ సభ్యులైన చెన్నుబోయిన శ్రీనివాసరావు, యలవర్తి శ్రీనివాసరావు కుటుంబాలలో వివాహ సందర్భంగా వేర్వేరుగా కళ్యాణమస్తు బంగారు నాణేలను చలసాని ఆందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సొసైటీ సభ్యులు, కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.