వన్‌టౌన్‌లో చవితి శోభ

ABN , First Publish Date - 2022-08-31T06:37:22+05:30 IST

వినాయకచవితి వన్‌టౌన్‌లో సందర్భంగా వన్‌టౌన్‌లోని రోడ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

వన్‌టౌన్‌లో చవితి శోభ

పత్రి, వినాయక ప్రతిమల కొనుగోళ్లతో సందడిగా మారిన పాతబస్తీ

వన్‌టౌన్‌, ఆగస్టు 30 : వినాయకచవితి వన్‌టౌన్‌లో సందర్భంగా వన్‌టౌన్‌లోని రోడ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వీధివీధినా చవితి పందిళ్లను వేసి భారీ విగ్రహాలను, భారీ సెట్టింగ్‌ల తో చిత్రవిచిత్ర పురాణ సంఘటనలతో తీర్చిదిద్దారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం మేళతాళాలతో భక్తుల కోలహలం మధ్య వేదమంత్రాల నడుమ వినాయక విగ్రహాలకు తొలిపూజను చేసి మిగతా కార్యక్రమాలను కొనసాగించనున్నారు. ఈ రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా పందిళ్లను వేయలేకపోయారు. ఈసారి భక్త బృందాలు అమితోత్సహంతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ నిర్వహణలో 50 ఏళ్లు నిండిన భక్తబృందాలుండడం విశేషం.

పత్రిలో అన్నీ దొరకటం లేదు..

వినాయకుడిని ఏకవింశతి పత్రాలతో పూజిస్తారన్నది తెలిసిందే. దీనికోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పత్రిని తీచ్చి విక్రయదారులు బజార్లలో స్టాళ్ల ను ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. భక్తులు పత్రిని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వ స్తోంది. పూలు, పళ్ల ధరలను అమాంతం పెంచేశా రు. కాగా, పత్రిలో అన్ని రకాలూ దొరకని వైనం. చా లామంది విక్రయదారులకు కానీ, కొనుగోలుదారుల కు గానీ శాస్త్ర ప్రకారం పత్రిని విడివిడిగా పరిశీలిం చే అనుభవం లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించిం ది. మాచీపత్రి, బలురక్కసి, మారేడు, గరిక, ఉమ్మె త్త, రేగు, ఉత్తరేణి, దేవకాంఛన పత్రం, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత పత్రం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజీ, అరేపత్రి, శమి, నేరేడు, వెలగ, జిల్లేడు వంటి 21 రకాల్లో కేవలం 10 రకాలే దొరుకుతున్నాయి.. అవి కూడా అంతంత మాత్రమే.

నగర ప్రజలకు పోతిన శుభాకాంక్షలు

నగర ప్రజలకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సిటీ అధ్యక్షుడు పోతిన మహేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి ఆనందంగా ఉండే లా వినాయకుడు శుభాశీస్సులు అందించాలని కోరుకుంటున్నానన్నారు. 

సీతమ్మవారి పాదాల వద్దే నిమజ్జనాలు

విద్యాధరపురం : గణపతి పూజలనంతరం విగ్రహాలను వీఎంసీ కార్యాలయం సమీపంలోని సీతమ్మవారి పాదాల ఘాట్‌ వద్ద మాత్రమే నిమజ్జనం చేయాలని భవానీపురం పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపురం పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌, పిండా ల ఘాట్‌ (పాత దుర్గాఘాట్‌) వద్ద ఎక్కడా విగ్రహాలను నిమజ్జనం చే యరాదని. ఈనెల 31నుంచి సెప్టెంబర్‌ 10వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-08-31T06:37:22+05:30 IST