గోల్డ్‌ క్లస్టర్‌ వద్దు

ABN , First Publish Date - 2022-09-25T05:57:38+05:30 IST

జగ్గయ్యపేటలో ఎంఎస్‌ఎంఈ కింద గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చే యవద్దని స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి చిన్నా ఆధ్వర్యంలో స్వర్ణకారసంఘ ప్రతినిధులు ఎంఎస్‌ఎంఈ మేనేజర్‌ శ్రీనివాస్‌ను కోరారు.

గోల్డ్‌ క్లస్టర్‌ వద్దు
ఎంఎస్‌ఎంఈ మేనేజర్‌కు వినతిపత్రం అందజేత

 స్వర్ణకార సంఘం వినతి

జగ్గయ్యపేట, సెప్టెంబరు 24: జగ్గయ్యపేటలో ఎంఎస్‌ఎంఈ కింద గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చే యవద్దని స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి చిన్నా ఆధ్వర్యంలో స్వర్ణకారసంఘ ప్రతినిధులు ఎంఎస్‌ఎంఈ మేనేజర్‌ శ్రీనివాస్‌ను కోరారు. క్టస్లర్‌కు వ్యతిరేకంగా ఉన్న స్వర్ణకారులతో చర్చలు జరిపేందుకు ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు మునిసిపల్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. స్వర్ణకారులు నూరుశాతం మంది క్లస్టర్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు.  క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తే న్యాయపోరాటం చేస్తామని కర్రి వివరించి వినతిపత్రం అందజేశారు. 


Read more